కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

ఆకాశంలో ఒక తార మనమందరం గర్వపడే సినిమాగా నిలుస్తుందని నమ్ముతున్నాను: హీరో దుల్కర్ సల్మాన్

I Believe Aakasamlo Oka Tara Will Be a Film We Can All Be Proud Of says Dulquer Salmaan

ఆకాశంలో ఒక తార మనమందరం గర్వపడే సినిమాగా నిలుస్తుందని నమ్ముతున్నాను: హీరో దుల్కర్ సల్మాన్

I Believe Aakasamlo Oka Tara Will Be a Film We Can All Be Proud Of says Dulquer Salmaan

I Believe Aakasamlo Oka Tara Will Be a Film We Can All Be Proud Of says Dulquer Salmaan

వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న డిఫరెంట్ ఎమోషనల్ డ్రామా ‘ఆకాశంలో ఒక తార’. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయమవుతుండగా, శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, సాంగ్ తో సినిమా పై అంచనాలు పెరిగాయి. ‘ఆకాశంలో ఒక తార’ నవంబర్ 20న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

హీరో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ‘సీతారామం’ తర్వాత ఈ కథ విన్నాను. కథ విన్నప్పుడే చాలా స్పెషల్‌గా అనిపించింది. కచ్చితంగా ఇది నా కెరీర్‌లో ఒక స్పెషల్ సినిమాగా నిలిచిపోతుందని నమ్ముతున్నాను. స్వప్నకు, అల్లు అరవింద్ గారికి థాంక్యూ. అల్లు అరవింద్ గారు చాలా డెడికేషన్‌తో వర్క్ చేస్తారు. ఆయన ఎంతో ఎనర్జీగా ఉంటారు. బహుశా బన్నీ గారు కూడా అంత ఎనర్జీగా ఉండటానికి కారణం అరవింద్ గారే. గుణ్ణం గంగరాజు గారికి థాంక్యూ. వారితో కలిసి పనిచేయడం మంచి ఎక్స్‌పీరియన్స్. అలాగే రాజ్‌కుమార్, మహేశ్‌లతో కలిసి పనిచేయడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. శ్వాసిక మా అక్క పాత్రలో కనిపిస్తుంది. రుహాని బిజిలి పాత్రలో కనిపిస్తుంది. మొదటి షెడ్యూల్‌లో రుహాని గారితోనే కలిసి పనిచేశాను. జీవీ ప్రకాష్ ఈ సినిమా కథ విన్నప్పుడే బ్లాక్‌బస్టర్ అని చెప్పారు. తను ఒక సినిమా బాగుందని చెప్పాడంటే కచ్చితంగా అందులో ఏదో ప్రత్యేకత ఉంటుందని నాకు తెలుసు. అలాంటిది ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని చెప్పడం నాకు మరింత నమ్మకాన్ని ఇచ్చింది.

డైరెక్టర్ పవన్ ఈ సినిమాపై ఎంతో నమ్మకంతో పనిచేశారు. ఆయనకు కథపై చాలా క్లారిటీ ఉంది. సాత్విక అమెరికాలో పుట్టి పెరిగింది. తను నటి కావాలని అనుకున్నప్పుడు, ఆ కలను నిజం చేసుకునేందుకు ఒక నిర్ణయం తీసుకుంది. నిజంగా తను ఒక ఇన్‌స్పిరేషన్. శ్రుతి హాసన్ ఈ సినిమాకు లైవ్ వైర్‌లా నిలిచారు. అద్భుతమైన ఎనర్జీతో నటించారు. తనతో కలిసి పనిచేయడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. బన్నీ గారికి సంబంధించిన ఒక మంచి సంఘటన మీతో పంచుకోవాలి. నా మొదటి సినిమా షూటింగ్ కేరళలోని ఒక పల్లెటూరిలో జరిగింది. అక్కడ నేను ఉంటున్న ఇంట్లో ఒక బీరువా మీద బన్నీ గారి ఫోటో ఉండేది. అప్పటికే ఆయన స్టార్‌గా ఎంతో పేరు సంపాదించారు. ఇప్పుడు గ్లోబల్ స్థాయికి చేరుకున్నారు. ‘అల వైకుంఠపురములో’ నాకు ఫేవరెట్ సినిమా. కరోనా సమయంలో మా ఫ్యామిలీ అంతా కలిసి ఎన్నోసార్లు ఆ సినిమా చూశాం. అలాగే అల్లు అర్జున్ గారికి మా పాప పెద్ద ఫ్యాన్‌. ఆయన మా వేడుకకు రావడం ఎంతో ఆనందంగా ఉంది.‘ఆకాశంలో ఒక తార’ కచ్చితంగా మనమందరం గర్వపడే సినిమా అవుతుందని నమ్ముతున్నాను.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్