సంక్రాంతి బరిలో కాకా .. డిసెంబర్ 1 నుంచే ప్రచార సందడి షురూ

Kaaka Promotions to Kick Off on December 1

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మాస్ ఎంటర్‌టైనర్ ‘కాకా’ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ చిత్ర సంగీత దర్శకుడు తమన్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా చేసిన ఒక పోస్ట్ మెగా అభిమానులను ఖుషి చేస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన భారీ అప్‌డేట్‌ను తమన్ పంచుకున్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచే ‘కాకా’ ప్రమోషనల్ సందడిని అట్టహాసంగా ప్రారంభించబోతున్నట్లు ఆయన ప్రకటించారు. అంతేకాకుండా, ఈ చిత్రం 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. “సంక్రాంతికి గట్టిగా కొడతాం.. ఇది ఫిక్స్.. బాస్ మెగాస్టార్ ర్యాంపేజ్” అంటూ తమన్ పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి, బాబీ కలయికలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ హైప్ నెలకొంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోన వెంకట్ రచనా సహకారం అందిస్తున్నారు. డిసెంబర్ 1 నుంచి పాటలు, టీజర్‌లతో ‘కాకా’ జాతర మొదలవుతుందని తమన్ హింట్ ఇవ్వడంతో, వచ్చే ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ విశ్వరూపం చూడటం ఖాయమని అభిమానులు సంబరపడుతున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.