తెలుగు చిత్ర పరిశ్రమలో మరో క్రేజీ మరియు సెన్సేషనల్ కాంబినేషన్ అధికారికంగా ఖరారైంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో ఒక పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం రూపొందనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటివరకు ఎన్నడూ చూడని విధంగా కడుపుబ్బా నవ్వించే వినోదాన్ని ఈ చిత్రం ద్వారా అందించబోతున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. ఈ ప్రాజెక్ట్‌పై దర్శకుడు అనిల్ రావిపూడి స్పందిస్తూ.. తారక్‌తో తన కలయిక ఎప్పటినుంచో రావాల్సి ఉందని, త్వరలోనే ఒక పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంతో రాబోతున్నామని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుందని మేకర్స్ స్పష్టం చేశారు. మాస్ ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్‌ను, తనదైన శైలి వినోదంతో అనిల్ రావిపూడి ఏ విధంగా చూపించబోతున్నారనే ఆసక్తి ఇప్పుడు సినీ వర్గాల్లో, అభిమానుల్లో భారీగా నెలకొంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
ఇక ఎన్టీఆర్ డ్రాగన్ తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో భారీ పౌరాణిక చిత్రం చేయాల్సివుంది.అయితే డ్రాగన్ తరువాత ఎన్టీఆర్ , అనిల్ రావిపూడి సినిమాని మొదలు పెట్టే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. ఎందుకంటే త్రివిక్రమ్ తో చేయాల్సిన సినిమా ప్రీ ప్రొడక్షన్ పూర్తయ్యేసరికే చాలా సమయం పట్టేలా వుంది. ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ , అనిల్ తో సినిమాను కంప్లీట్ చేయనున్నాడు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























