కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

ఘనంగా జరిగిన హీరో తేజ సజ్జా నిశ్చితార్థం

ఘనంగా జరిగిన  హీరో  తేజ సజ్జా నిశ్చితార్థం

ఘనంగా జరిగిన హీరో తేజ సజ్జా నిశ్చితార్థం

Teja Sajja’s Engagement Ceremony Held in a Grand Manner

ఘనంగా జరిగిన  హీరో  తేజ సజ్జా నిశ్చితార్థం

టాలీవుడ్ యువ హీరో, ‘హనుమాన్’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా త్వరలో సరికొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. ఆయన నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా, సన్నిహితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా జరిగింది.

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న తాజ్ కృష్ణ హోటల్‌లో ఈ వేడుకను నిర్వహించారు. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు, బంధుమిత్రులు ఈ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని నూతన జంటను ఆశీర్వదించారు. ఈ వేడుకకు టాలీవుడ్ అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ, నేచురల్ స్టార్ నాని ప్రత్యేక అతిథులుగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే హరీశ్ రావు, నటుడు శివాజీ, నిర్మాత సాహు గారపాటి, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తదితరులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.

బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన తేజ సజ్జా.. ఆ తర్వాత హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హనుమాన్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించి దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక సినిమాల పరంగా ప్రస్తుతం ‘మిరాయ్ 2’ చిత్రంతో పాటు పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్న తేజ సజ్జాకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

వీడియోస్

ఘనంగా జరిగిన  హీరో  తేజ సజ్జా నిశ్చితార్థం
సినిమాteja sajja1 కథనాలు · సినిమా పేజీ →

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్