ధనుష్ హీరోగా, రాజ్ కుమార్ పెరిసామి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘ఓ.౦: చాప్టర్ 1 – ది బ్లడ్ వుడ్’ (O.M – Operation Mole) ట్రైలర్ తాజాగా విడుదలైంది. మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తుండగా, సాయి పల్లవి, శ్రీలీల నటిస్తున్న ఈ చిత్రంపై ట్రైలర్‌తో అంచనాలు ఒక్కసారిగా తారాస్థాయికి చేరాయి. ట్రైలర్ ఆరంభంలోనే సమ్ ఆఫ్ ది ఈజ్ థింగ్స్ యాక్చువల్లీ హ్యాపెండ్ అనే ఇంట్రెస్టింగ్ నోట్‌తో సినిమా రూరల్ క్రైమ్ మరియు అటవీ ప్రాంత నేపథ్యాల చుట్టూ తిరుగుతుందని స్పష్టం చేశారు. రెండు టెంపుల్ టౌన్స్ మధ్య, రెండు వేర్వేరు ప్రపంచాల నడుమ జరిగే నేర సామ్రాజ్యాన్ని అణచివేయడానికి ఏర్పాటు చేసిన ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ మరియు ఆపరేషన్ మోల్ చుట్టూ కథ నడుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ధనుష్ చాలా రఫ్, ఇంటెన్స్ అండ్ వైల్డ్ యాక్షన్‌తో కనిపించగా, మరోవైపు మెగాస్టార్ మమ్ముట్టి స్టైలిష్ అండ్ పవర్ఫుల్ లుక్‌లో అదరగొట్టారు. వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే విజువల్స్ సినిమాపై హైప్ పెంచేలా ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్‌గా, ఆపరేషన్‌ను లీడ్ చేసే పవర్ఫుల్ పాత్రలో సాయి పల్లవి కనిపించగా, మరో కీలక పాత్రలో శ్రీలీల లుక్ కూడా ఆకట్టుకునేలా ఉంది.
సాయి అభ్యంకర్ అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. యాక్షన్ కొరియోగ్రఫీ, విజువల్స్ చాలా రిచ్‌గా, డార్క్ టోన్‌లో ఉన్నాయి. డైరెక్టర్ రాజ్ కుమార్ పెరిసామి ఎంచుకున్న కథాంశం, టేకింగ్ విధానం సినిమాను ఒక సరికొత్త యాక్షన్ జానర్‌గా మలచబోతున్నట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్ టేక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 20, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదలకు ముందే ట్రైలర్‌తో భారీ బజ్ క్రియేట్ చేసిన ‘ఓ.౦’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఒక రేంజ్లో సౌండ్ చేయడం గ్యారెంటీ అనిపించేలా ఉంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























