కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

అత్యధిక ఓవర్సీస్ వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించిన రామాయణ

Ramayana Sets a Record as the Highest-Grossing Indian Film Overseas

అత్యధిక ఓవర్సీస్ వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించిన రామాయణ

Ramayana Sets a Record as the Highest-Grossing Indian Film Overseas

Ramayana Sets a Record as the Highest-Grossing Indian Film Overseas

దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కించిన ప్రతిష్టాత్మక దృశ్యకావ్యం ‘రామాయణ’ ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతున్న ఈ చిత్రం, విడుదలైన కేవలం 11 రోజుల్లోనే విదేశాల్లో 50 మిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించి సంచలనం రేపింది. నమిత్ మల్హోత్రా నిర్మాణంలో భారీ స్థాయిలో రూపొందిన ఈ చిత్రం, భారతీయ సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో మరోసారి ఘనంగా చాటిచెప్పింది.

ఈ అద్భుత వసూళ్లతో ‘రామాయణ’ ఆల్ టైమ్ అత్యధిక ఓవర్సీస్ వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 50.1 మిలియన్ డాలర్ల వసూళ్లతో మొదటి స్థానంలో నిలిచిన ఈ చిత్రం.. ఇప్పటివరకు అగ్రస్థానాల్లో ఉన్న ‘ధురంధర్ 2’ (50 మిలియన్ డాలర్లు), ‘పఠాన్’ (49.3 మిలియన్ డాలర్లు), ‘జవాన్’ (48 మిలియన్ డాలర్లు), మరియు ‘బాహుబలి 2’ (46.9 మిలియన్ డాలర్లు) చిత్రాల రికార్డులను అధిగమించింది.ఈ ఘనత వెనుక మరో ప్రత్యేకమైన రికార్డు కూడా నమోదైంది.

గతంలో 50 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన ‘ధురంధర్ 2’ ఒక సీక్వెల్ చిత్రం కాగా, ఎలాంటి సీక్వెల్ నేపథ్యం లేకుండానే ఓవర్సీస్‌లో 50 మిలియన్ డాలర్ల మార్కును అందుకున్న మొట్టమొదటి నాన్-సీక్వెల్ భారతీయ చిత్రంగా ‘రామాయణ’ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ చిత్రం 11 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 1400కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించింది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్