వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ ఛలో మూవీ తో కన్నడ బ్యూటీ టాలీవుడ్ కు పరిచయం అయిన విషయం తెలిసిందే. కన్నడ , తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న రష్మిక స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. నేషనల్ క్రష్ గా మారిన రష్మిక ప్రస్తుతం పుష్ప :ది రూల్ , బాలీవుడ్ మూవీ యానిమల్ లో కథానాయికగా నటిస్తున్నారు. రష్మిక ఇప్పుడు ఒక తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వెంకీ కుడుములు దర్శకత్వంలో నితిన్ , రష్మిక జంటగా తెరకెక్కిన భీష్మ మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ లో హీరో నితిన్ , రష్మిక అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు రష్మిక హీరో నితిన్ తో మరోసారి జతకట్టనున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కనున్న మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.దర్శకుడు వెంకీ , హీరోయిన్ రష్మిక ల హ్యాట్రిక్ మూవీ గా ఈ మూవీ తెరకెక్కనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























