కింగ్ నాగార్జున హీరోగా ఆర్. ఏ. కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైలురాయి చిత్రం ‘కింగ్ 100’ . అన్నపూర్ణ స్టూడియోస్ మరియు టీ-సిరీస్ సౌత్ బ్యానర్లపై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా, నేడు ప్రముఖ నటి టబు పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఆమె పాత్రకు సంబంధించిన స్పెషల్ గ్లింప్స్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ సినిమాలో టబు పాత్ర పేరు ‘మహంతి ఝాన్సీ రాణి’ అని మేకర్స్ ప్రకటించారు.
విడుదలైన గ్లింప్స్‌లో టబు ఎంతో ఇంటెన్స్‌గా, పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన నేపథ్య సంగీతం ఈ గ్లింప్స్‌కు మరింత హైలైట్‌గా నిలిచింది. నాగార్జున – టబు కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఈ గ్లింప్స్ అంచనాలను మరింత పెంచేసింది.
ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ఈ చిత్రాన్ని థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























