ఎన్టీఆర్ 30.. ఈసినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇప్పటికే జనతా గ్యారేజ్ వచ్చి మంచి విజయం సాధించింది. దీంతో రెండో సారి ఈ కాంబినేషన్లో సినిమా అనగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయిపోయిన వెంటనే ఈసినిమా ఈసినిమా పట్టాలెక్కుతుందని అనుకున్నారు కానీ అది ఇంతవరకూ జరగలేదు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ రేంజ్ మరింత ఎక్కువవడంతో కొరటాల శివ తన స్క్రిప్ట్ పై మరింత దృష్టిని పెడుతున్నాడు. ఈసినిమా షూటింగ్ లేట్ అవ్వడానికి ఇది కూడా ఒక కారణం అని చెెప్పొచ్చు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు ఇప్పటికే సినిమా షూటింగ్ మొదలవుతుందని రెండు మూడు నెలలు నుండి అంటున్నా ఇంతవరకూ అది జరిగింది లేదు. ఇక ఈసినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులు అయితే వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కాస్త ఆనందాన్ని ఇచ్చే వార్త ఒకటి వినిపిస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నట్టు తెలుస్తుంది. కొరటాల శివ ఇంకా సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సబు సెరిల్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈసినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు కూడా సమాచారం.
కాగా యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాలో నటించే హీరోయిన్ అలానే ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: