మలయాళ వర్సటైల్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని జేఆర్సి కన్వెన్షన్ సెంటర్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ తన ప్రసంగంతో అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాతో నిర్మాతగా తన ప్రయాణం కొనసాగిస్తున్న ఎస్.ఎస్. కార్తికేయ మాట్లాడిన తీరు వేడుకలోని వారిని ఎమోషనల్ చేసింది. వేదికపై కార్తికేయ మాట్లాడుతూ తన తండ్రి రాజమౌళి, తల్లి రమా రాజమౌళి వైపు చూస్తూ భావోద్వేగానికి గురయ్యారు.
“బాబా.. ప్రొడ్యూసర్‌గా నీ పేరును ఎప్పుడూ చెడగొట్టను” అని మాటిచ్చారు. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ సమయాల్లో తానందుకున్న అనుభవం ఈ రోజు ప్రొడ్యూసర్‌గా మారడానికి కారణమైందని చెప్పారు. “తారక్ అన్న నాకు సొంత అన్నయ్య కంటే ఎక్కువ. నా ప్రతి కష్టసుఖాల్లో ఆయన నా పక్కనే ఉన్నారు. ఈ సినిమా మా టీమ్ అందరికీ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్” అని కార్తికేయ ఎమోషనల్ అయ్యారు. ఆయన ప్రసంగం వింటున్న సమయంలో రాజమౌళి, రమా దంపతులతో పాటు ఎన్టీఆర్ కూడా కాసేపు కళ్లు చెమర్చడం విశేషం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























