అక్టోబర్ 2 నుంచి జియోహాట్‌స్టార్‌లో ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’ స్ట్రీమింగ్థియేటర్లలో రికార్డుల మోత మోగించి ఓటీటీ బాట పట్టిన నివిన్ పౌలీ, మమితా బైజు చిత్రంబాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తూ రూ.320 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన మలయాళ రొమాంటిక్ కామెడీ బ్లాక్‌బస్టర్ ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక జియోహాట్‌స్టార్ లో అక్టోబర్ 2 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నివిన్ పౌలీ, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ‘ప్రేమలు’ ఫేమ్ గిరీష్ ఏడీ దర్శకత్వం వహించారు. భావనా స్టూడియోస్ బ్యానర్‌పై ఫహద్ ఫాజిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
కేవలం రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.325 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి మలయాళ సినీ చరిత్రలోనే ఆల్-టైమ్ హైయెస్ట్ గ్రాసర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించింది.
13 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్న జస్టిన్ (నివిన్ పౌలీ), ఆష్లే (మమితా బైజు)ల మధ్య చిగురించిన ఆసక్తికరమైన ప్రేమ కథ మరియు బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ నేపథ్యంలో జరిగే వినోదాత్మక సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ మరియు హిందీ భాషల్లో అక్టోబర్ 2 నుంచి ఈ చిత్రం జియోహాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఈ గాంధీ జయంతి కానుకగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ఈ బ్లాక్‌బస్టర్ ఎంటర్‌టైనర్‌ను వీక్షించవచ్చు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























