నైట్రో స్టార్ సుధీర్ బాబు రొటీన్ కు భిన్నంగా సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా డిఫరెంట్ రోల్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. రీసెంట్ గా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. మహేష్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న సినిమా హంట్. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈసినిమాలో శ్రీకాంత్, భరత్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాతో పాటు మరో కొత్త సినిమాను సుధీర్ బాబు లైన్ లో పెట్టాడు. జ్ఞానసాగర ద్వారక దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా ఒక సినిమా రాబోతుంది. ఇక ఈసినిమా టైటిల్ ను నేడు రిలీజ్ చేయనున్నట్టు రెండు రోజుల క్రితమే అప్ డేట్ వచ్చింది. దీనిలో భాగంగానే నేడు ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాకు హరోం హర అనే పవర్ పుల్ టైటిల్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు టైటిల్ కాన్సెప్ట్ కు సంబంధించిన చిన్న ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఇక ఈసినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు.
ఇంగ సెప్పేది ఏం లేదో… సేసేదే!! “Looking forward” is an understatement … I am pumped to play Subrahmanyam 👊👊 This time, the world is going to be bigger !!!! BIGGEST 🔥#HaromHara – The Revolthttps://t.co/icMZKa83ID@gnanasagardwara @chaitanmusic @SumanthnaiduG @SSCoffl pic.twitter.com/K4cb4jB3ET
— Sudheer Babu (@isudheerbabu) October 31, 2022
కాగా కుప్పం నేపథ్యంలో డివైన్ టచ్ తో ఈసినిమా రానున్నట్టు అర్థమవుతుంది. ఇక ఈసినిమాలో సుధీర్ మరోసారి ఫుల్ మాస్ అవతారంలో కనిపించనున్నట్టు తెలుస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జీ నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ఈసినిమాకు సంబంధించిన వివరాలు అన్ని వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: