మలయాళ వర్సటైల్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని JRC కన్వెన్షన్ సెంటర్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ తన ప్రసంగంతో అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
చేతికి సర్జరీ పూర్తయి కోలుకున్న తర్వాత మొదటిసారి పబ్లిక్ ఈవెంట్‌కు వచ్చిన తారక్.. నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. “‘స్టూడెంట్ నంబర్ 1’ సమయంలో కార్తికేయ 9 ఏళ్ల పిల్లాడు, నేను 17 ఏళ్ల కుర్రాడిని. ఈ రోజు అతడు స్వతంత్ర నిర్మాతగా మారడం నాకు ఎంతో గర్వకారణం. నా తల్లికి మరో కుమారుడు పుట్టి ఉంటే అది కార్తికేయే అయ్యేవాడు, అతడు నా సొంత తమ్ముడు” అని పేర్కొన్నారు.
అలాగే ఫహద్ ఫాజిల్ నటనను ప్రశంసిస్తూ, ‘బెంగళూర్ డేస్’ నుంచి ఆయన అభిమానినని, ఇండియన్ సినిమా గర్వించదగ్గ నటుల్లో ఫహద్ ఒకరని కొనియాడారు. చివర్లో “డోంట్ ట్రబుల్ ది ట్రబుల్.. ఇఫ్ యు ట్రబుల్ ది ట్రబుల్, ది ట్రబుల్ విల్ ట్రబుల్ యు” అంటూ పంచ్ డైలాగ్ చెప్పి అభిమానులను ఖుషీ చేశారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























