యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ప్రతిష్టాత్మక ‘ది ట్రూత్ సిరీస్’ నుంచి రెండవ ఎపిసోడ్‌ను విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘Truth 2: The History We Forgot’ పేరుతో విడుదలైన ఈ ప్రత్యేక వీడియోలో, భారతదేశంలో బ్రిటిష్ పాలకులు రైల్వే వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేశారు? దాని వెనుక ఉన్న ఆక్రమణ మరియు ధాన్యం దోపిడీ నిజాలేంటి? అనే షాకింగ్ విషయాలను బయటపెట్టారు. 1876-78నాటి గ్రేట్ మద్రాస్ కరువు సమయంలో ఒకవైపు కోటి మంది భారతీయులు ఆకలితో అలమటిస్తుంటే, మరొకవైపు బ్రిటీషర్లు ఇక్కడి ధాన్య సమృద్ధిని రైలు మార్గాల ద్వారా తమ దేశానికి తరలించుకుపోయిన దారుణ హిస్టరీని ఈ వీడియో వేదికగా విశ్లేషించారు.
మైత్రీ మూవీ మేకర్స్, టి-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ పాన్-ఇండియా చిత్రం అక్టోబర్ 16, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. దశాబ్దాల తరబడి దాగిన చరిత్రలోని నిజాలను వెలికితీస్తూ వస్తున్న ఈ డాక్యుమెంటరీ సిరీస్ చిత్రంపై అంచనాలను మరింత పెంచుతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























