ప్రభాస్ ప్రస్తుతం పాన్ఇండియా సినిమాలతో బిజీగా ఉండగా అందులో ఆది పురుష్ సినిమా కూడా ఒకటి. ఇతిహాసాలలో ఒకటైన రామాయణం ఆధారంగా ఆదిపురుష్ సినిమా రూపొందుతోంది. ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్నఈ మూవి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఈసినిమాలో గ్రాఫిక్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంది కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం తీసుకోనున్నారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాను పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాను ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈసినిమా నిర్మాతల్లో ఒకరు ఇంగ్లీష్ లో కూడా ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. అయితే ఇప్పుడు నిజంగానే మరోసారి ఈవార్తలకు క్లారిటీ వచ్చేసింది. లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూ లో రెబల్ స్టార్ కృష్ణం రాజు గారే రివీల్ చేయడం జరిగింది. తాను మాట్లాడుతూ ప్రభాస్ ని హాలీవుడ్ కి ఆదిపురుష్ తో పరిచయం చేస్తున్నామని ఈ సినిమా ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ అవుతుంది అని తెలిపారు. దీనితో కన్ఫర్మ్ అయ్యిపోయింది.
కాగా 3డీ విజువల్ ఎఫెక్ట్స్ తో మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈసినిమాలో రాముని పాత్రలో ప్రభాస్ నటించగా.. సీతగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. అలాగే లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























