ఇండియన్ జేమ్స్ కేమరాన్, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి – సూపర్‌స్టార్ మహేష్ బాబు కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న గ్లోబ్‌ట్రాటింగ్ ఎపిక్ ‘వారణాసి’ విడుదల తేదీపై వస్తున్న రూమర్లకు చెక్ పడింది. సినిమా ఆలస్యం కానుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే సినిమా థియేటర్లలోకి రానుందని చిత్రబృందం స్పష్టం చేసింది.మరో 250 రోజుల్లో అంటూ ట్వీట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ పాన్-వరల్డ్ విజువల్ వండర్‌ను 2027 ఏప్రిల్ 7న ఉగాది మరియు శ్రీరామనవమి పండుగల కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ (IMAX), డాల్బీ సినిమా ఫార్మాట్లలో చాలా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు.
మహేష్ బాబు (రుద్ర పాత్రలో) సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా జోనస్ కథానాయికగా నటిస్తుండగా.. వర్సటైల్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ (కుంభ పాత్రలో) పవర్ఫుల్ విలన్‌గా చేస్తున్నాడు.
క్రీ.పూ. 7000 నాటి రామాయణ కాలం నుండి 2027 కాలం వరకు సాగే వినూత్న టైమ్ ట్రావెల్ అడ్వెంచర్ డ్రామాగా దీనిని విజయేంద్ర ప్రసాద్ కథతో రాజమౌళి రూపుదిద్దిస్తున్నారు. సుమారు రూ. 1000 కోట్ల పైచిలుకు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా వేగంగా జరుగుతోంది. రాజమౌళి మార్క్ గ్రాండియర్ మరియు విజువల్ ఎఫెక్ట్స్‌తో వస్తున్న ఈ చిత్రం ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























