కొరియన్ కనకరాజు ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్

Korean Kanakaraju Trailer Release Date and Time Locked

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘కొరియన్ కనకరాజు’. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, కిమ్‌చి కారమ్ టీజర్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకోగా.. తాజాగా మేకర్స్ ఈ చిత్ర ఫుల్ ట్రైలర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు.ఈ చిత్రం ట్రైలర్‌ను ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక కుర్రాడికి (వరుణ్ తేజ్) కొరియన్ ఆత్మ పడితే ఏమవుతుంది? అనంతపురం స్లాంగ్ మరియు కొరియన్ లాంగ్వేజ్ కలగలిపి ఆయన చేసే హంగామా చుట్టూ ఈ సినిమా సాగనుంది.ఇందులో వరుణ్ తేజ్ క్లోజ్ ఫ్రెండ్‌గా, ఫోటోగ్రాఫర్ పాత్రలో కమెడియన్ సత్య అలరించనుండగా.. రితికా నాయక్ కథానాయికగా నటించింది.

యువీ క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.ఆగస్టు 7న థియేటర్లలోకి రానున్న ఈ వినూత్న హారర్ కామెడీ చిత్రంపై రేపు విడుదల కాబోతున్న ట్రైలర్‌తో అంచనాలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.