కరోనా వల్ల ఇప్పటికే సినీ పరిశ్రమల్లో ఎంతో మంది కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే కొంతమంది సెలబ్రిటీలు మాత్రం మృతి చెందిన సంగతి కూడా విదితమే. అయితే ఈమధ్య కాస్త పరిస్థితులు బాగున్నాయి కదా అనుకుంటుండగానే మళ్లీ కరోనా ప్రభావం సెలబ్రిటీలపై పడుతుంది. ఇప్పటికే విలక్షణ నటుడు కమల్ హాసన్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అవ్వగా ప్రస్తుతం చెన్నైలోని ఒక ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కమల్ ఆరోగ్యం అయితే నిలకడగానే ఉన్నట్టు వైద్య సిబ్బంది తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ప్రముఖ సీనియర్ కొరియోగ్రాఫర్ కరోనా బారిన పడ్డారు. ఆయన ఎవరో కాదు శివ శంకర్ మాస్టర్. ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్‌కు కరోనా సోకడంతో ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గత నాలుగు రోజులుగా ఆయన హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకడంతో పరిస్థితి కాస్త విషమంగా మారినట్టు తెలుస్తుంది. అయితే ఆయన చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయని, వారి దగ్గర అంత డబ్బు లేకపోవడంతో దాతల సాయం కోసం ఆ కుటుంబం ఎదురు చూస్తోంది. ఈనేపథ్యంలోనే కరోనా సమయంలో ఎంతోమందికి అండగా నిలిచి నేటితరం కర్ణుడు అనిపించుకున్న సోనూసూద్ ముందుకు వచ్చారు. వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇక ఈవిషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. వారి కుటుంబంతో ఇప్పటికే టచ్ లో ఉన్నానని.. శివశంకర్ మాస్టర్ లైఫ్ సేవ్ చేయడానికి తన వంతు తాను సాయం చేస్తానని తెలిపారు. మరి శివశంకర్ మాస్టర్ త్వరగా కోలుకోవాలని మనం కూడా కోరుకుందాం.
Iam already in touch with the family,
Will try my best to save his life 🙏 https://t.co/ZRdx7roPOl— sonu sood (@SonuSood) November 25, 2021
కాగా శివ శంకర్ మాస్టర్ తెలుగు, తమిళ భాషల్లోని ఎన్నో పాటలకు కొరియోగ్రఫీ చేశారు. ఎంతోమంది స్టార్ హీరోలకు పనిచేశారు. నాలుగుసార్లు తమిళనాడు స్టేట్ అవార్డు అందుకున్నారు. ఇక డ్యాన్స్ మాస్టర్‌గానే కాకుండా పలు సినిమాల్లో కూడా నటించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: