“శ్రీ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన తమన్నా తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పలు మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో నటించి తమన్నా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. .తమన్నా ప్రస్తుతం “గుర్తుందా శీతాకాలం “, “F 3”, “భోళా శంకర్ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. హిందీలో ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో బ్లాక్ బస్టర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా “F 3” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. “F 3” మూవీలోని ఒక కామెడీ సన్నివేశానికై తమన్నా దేవత గెటప్ లో మారారు. ఎప్పుడూ ట్రెండీ కాస్ట్యూమ్స్ లో మెరిసే తమన్నా ఇపుడు నల్ల చీర, బ్లౌజ్‌లో నెత్తిన కిరీటం పెట్టుకుని, మెడలో ఆభరణాలు వేసుకుని దేవత గెటప్ లో అరటాకులో భోజనం చేస్తున్న ఫొటో ప్రేక్షకులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: