ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా అది పురుష్. ఇక ఈసినిమాను మాములు స్పీడ్ లో పూర్తి చేయట్లేదు ఓం రౌత్. కరోనా సమయంలో మొదలైన ఈ సినిమా షూటింగ్ ను పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటూ శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేస్తున్నాడు. మొదట ముంబైలో షూటింగ్ మొదలుపెట్టగా.. ఆతరువాత కరోనా వల్ల అక్కడ షూట్ చేయడానికి వీలు లేకపోవడంతో హైద్రాబాద్ లో కూడా షూటింగ్ ను చేశాడు ఓం రౌత్. అందుకే అనుకున్నదానికంటే చాలా వేగంగా షూటింగ్ ను పూర్తి చేయగలుగుతున్నాడు. ఇప్పటికే ఈసినిమాలో రావణాసురుడి పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా.. ఇప్పుడు కృతిసనన్ కూడా తన షూటింగ్ ను పూర్తి చేసుకుంది. కృతి సనన్ ఈసినిమాలో సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Dear Kriti, it was magical watching you play Janaki. Can’t believe your part is wrapped up. What a lovely journey!!!#Adipurush@kritisanon pic.twitter.com/hVsVrZiaAK
— Om Raut (@omraut) October 16, 2021
ఇక ఇదిలా ఉండగా త్రీడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి ఈసినిమా షూటింగ్ త్వరగా పూర్తయినా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మాత్రం చాలా టైమ్ పడుతుంది. దీనికోసం చాలా మంది విదేశీ నిపుణులే పనిచేయనున్నట్టు తెలుస్తుంది.
కాగా సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను పోషిస్తున్నాడు. 3డీ విజువల్ ఎఫెక్ట్స్ తో మైథిలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























