కొరియన్ కనకరాజు నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ – వరుణ్ తేజ్

Korean Kanakaraju Is Non-Stop Entertainment says Varun Tej

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ సూపర్‌నేచురల్ ఎలిమెంట్స్, నవ్వులు పంచే వినోదంతో గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించనుంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ఎంటర్‌టైనింగ్ టీజర్,  ట్రైలర్, చార్ట్‌బస్టర్‌గా నిలిచిన రెండు పాటల సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ‘కొరియన్ కనకరాజు’ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ భీమవరంలో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ… అందరికీ హాయ్.  ‘కొరియన్ కనకరాజు తో ఆగస్టు 7న థియేటర్లలో నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండబోతోంది. డెఫినెట్‌గా మీరందరూ ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. 2018లో ‘తొలిప్రేమ’ సినిమా ఈవెంట్ కోసం ఇక్కడికి వచ్చాను. ఈ కాలేజ్‌తో నాకు చాలా అనుబంధం ఉంది. ‘తొలిప్రేమ’ తర్వాత మళ్లీ ‘కొరియన్ కనకరాజు’ ఈవెంట్‌ను మీ అందరి సమక్షంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మీ అందరి ఉత్సాహం చూస్తుంటే ‘తొలిప్రేమ’ మ్యాజిక్ ఈ సినిమాతో మళ్లీ రిపీట్ అవుతుందనిపిస్తోంది. ఈ సినిమాతో నాకు, మా టీమ్ అందరికీ పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. మా ప్రొడ్యూసర్స్ చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. గాంధీ చాలా మంచి కామెడీ టైమింగ్ ఉన్న దర్శకుడు. తన కెరీర్‌లో మరో పెద్ద హిట్ ఈ సినిమా అవుతుందని నమ్ముతున్నాను. నన్ను ఈ సినిమాలో చాలా కొత్తగా చూపించారు. తమన్ ఏ హీరో సినిమా అయినా తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. ఈ విషయంలో ఆయన ఎప్పుడూ సక్సెస్ అవుతారు. తమన్‌తో ఇది నాకు మూడో సినిమా. ఈ సినిమా రీ-రికార్డింగ్ చూశాను. ఈ చిత్రంలో మ్యూజిక్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. చివరి పది రోజులుగా నేను తమన్ దగ్గరే ఎక్కువగా ఉన్నాను. సినిమాకు ఆయన ప్రాణం పోశారు. రితిక గ్రేట్ కో-స్టార్. ‘కొరియన్ కనకరాజు’తో తన విజయ ప్రయాణం కొనసాగాలని కోరుకుంటున్నాను. సత్య క్రేజీ కమెడియన్. ఈ సినిమాలో ‘కృష్ణప్ప’ పాత్ర చెప్పినప్పుడే సత్య తప్ప ఇంకెవరూ గుర్తుకు రాలేదు. మా ఇద్దరి కాంబినేషన్ ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. మిగతా టెక్నికల్ టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ప్రతి సినిమాకు సపోర్ట్ చేస్తూ మాకు ధైర్యం ఇస్తున్న అభిమానులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు గర్వపడే సినిమా ఇది. సినిమా ప్రేమించే ప్రతి ఒక్కరూ కుటుంబంతో కలిసి థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేస్తారు. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. ‘ఓజీ’తో సక్సెస్ స్టార్ట్ అయింది, సంక్రాంతి కి రఫ్ఫాడించారు.  ‘పెద్ది’తో చరణ్ అన్న ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చారో అందరికీ తెలుసు. వాళ్ల రేంజ్‌లో కాకపోయినా, నా రేంజ్‌లో ఈ సక్సెస్‌ను కొనసాగించాలని ప్రయత్నిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్యూ. తప్పకుండా మరోసారి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలుస్తాను. మా సినిమాపై ఉన్న కాన్ఫిడెన్స్‌తో ఒక రోజు ముందుగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రీమియర్స్ వేస్తున్నాం. ఆగస్టు 6 రాత్రి నుంచే ‘కొరియన్ కనకరాజు’ థియేటర్లలో అందుబాటులో ఉంటుంది. మీ అందరినీ అలరిస్తుందనే నమ్మకంతో ఒక రోజు ముందే మీ ముందుకు వస్తున్నాం. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది.”

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.