ది ప్యారడైజ్ టీజర్ నెక్స్ట్ లెవెల్

The Paradise Teaser Takes the Hype to the Next Level

‘దసరా’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత నేచురల్ స్టార్ నాని, విజనరీ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ రా అండ్ రస్టిక్ పాన్-ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’ . అనౌన్స్‌మెంట్ రోజు నుంచే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఆఫీషియల్ టీజర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విడుదలైన టీజర్ ప్రేక్షకులకు సరికొత్త విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తోంది. పొడవైన జడలు, రఫ్‌ అండ్‌ టఫ్‌ లుక్‌లో ‘జడల్ జమానా’ అవతారంలో నాని కనిపించిన తీరు అభిమానులను, సినీ ప్రియులను కట్టిపడేస్తోంది. నాని మాస్ అండ్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్, శ్రీకాంత్ ఓదెల టేకింగ్ ఈ సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందో స్పష్టం చేస్తున్నాయి.

ఈ విజువల్ వండర్‌కు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన ఊరమాస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తనదైన మార్క్ సంగీతంతో సన్నివేశాలకు జీవం పోశారు. ఇక ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ‘సికెంజా మాలిక్’ అనే అత్యంత పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తుండగా.. కయాదు లోహర్, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు, తనికెళ్ల భరణి, సోనాలి కులకర్ణి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘ఆయా షేర్’ సాంగ్ రికార్డు వ్యూస్‌తో ట్రెండ్ అవ్వగా, ఇప్పుడు వచ్చిన ఈ పవర్‌ఫుల్ టీజర్‌తో ‘ది ప్యారడైజ్’ పై పాన్-ఇండియా స్థాయిలో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.