గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ తో పవన్ కళ్యాణ్ రెండో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో కూడా పూజా హెగ్డే నే హీరోయిన్ అని హరీష్ ఇటీవలే ఒక ఫంక్షన్ వేదికగా క్లారిటీ ఇచ్చిన సంగతి కూడా గుర్తుండే ఉంటుంది కదా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక పూజా హెగ్డే బర్త్ డే సందర్భంగా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ కూడా పూజా హెగ్డే కి బర్త్ డే విషెస్ అందించాడు. పూజా హెగ్డే హరీష్ శంకర్ దర్శకత్వంలో రెండు సినిమాలు చేసిన సంగతి తెలసిందే కదా. డీజే, గద్దల కొండ గణేష్ సినిమాల్లో నటించగా ఆ సినిమాల్లోని లుక్స్ ను పోస్ట్ చేస్తూ.. పూజా ఏ రోల్ కి అయినా సరిపోతుంది అని విషెష్ చెపుతూ ప్రశంసించాడు. ఈనేపథ్యంలో హరీష్ ట్వీట్ పై స్పందించిన పూజా ధ్యాంక్యూ.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లో ఎలాంటి రోల్ ప్లాన్ చేస్తున్నారు అంటూ ట్వీట్ లో పేర్కొంది.
Awww… thank you so much! 🤗 looking forward to the next character you have planned for me! 🤗 💃🏻 https://t.co/Bz4gt9yYc6
— Pooja Hegde (@hegdepooja) October 14, 2021
కాగా ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ సరసన పూజా హెగ్డే నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే నెల సెట్స్‌పై కి రానున్నట్లు తెలుస్తోంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























