
డేవిడ్ వార్నర్ టిక్‌టాక్ వీడియోలతో అభిమానులను అలరిస్తున్నాడు. ముఖ్యంగా తెలుగు డైలాగ్స్, పాటలతో అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు. బుట్టబొమ్మ, పోకిరి, బాహుబలి డైలాగ్స్‌తో టాలీవుడ్ అభిమానులను మెప్పిస్తున్నాడు. ఈ క్రమంలో మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని ‘మైండ్ బ్లాక్’ పాటకు టిక్‌టాక్ చేయాల్సిందిగా మహేష్ బాబు ఫ్యాన్స్ కోరారు. దీంతో అభిమానుల కోరిక మేరకు ‘మైండ్ బ్లాక్’ పాటకు తన సతీమణితో కలిసి చిందులేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘మైండ్ బ్లాక్’ పాటకు సంబంధించిన స్టెప్పులతో పార్ట్-1 అంటూ ఒక వీడియో రిలీజ్ చేశాడుఈ పాట స్టెప్పుల కోసం చాలా కష్టపడ్డానని, 15 నిడివిగల ఈ టిక్‌టాక్ కోసం 51 సార్లు ప్రయత్నం చేశానని వార్నర్ చెప్పుకొచ్చాడు. ఈ పాటకు సంబంధించి మరో టిక్‌టాక్ వీడియో త్వరలోనే విడుదల చేస్తానని వార్నర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం వార్నర్ ‘మైండ్ బ్లాక్’ టిక్‌టాక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక వార్నర్ వీడియో పై మహేష్ కూడా స్పందించి.. 51 సార్లు ప్రయత్నం చేశారంటే నమ్మాలని లేదు… చాలా తేలికగా చేసినట్టు వుంది అని మహేష్ రిప్లై ఇచ్చాడు. మరి వార్నర్ రెండో వీడియో ఎప్పుడు రిలీజ్ చేస్తాడో చూడాలి.
Attempt 51 haha part 1 of @urstrulyMahesh #mindblock @CandyFalzon pic.twitter.com/AYrRVD3ooX
— David Warner (@davidwarner31) May 30, 2020

మహేష్ బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’. థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో మైండ్ బ్లాక్ పాటకు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంత కాదు. ఈ పాటలో మహేష్ స్టెప్పులు, అందర్నీ కట్టిపడేశాయి. చాలా ఏళ్ళ తర్వాత మహేష్ ఈ రేంజ్ లో డ్యాన్స్ వేయడంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































