పొలిమేర 3లోకి యాక్షన్ కింగ్

Polimera 3 Ropes In Action King arjun for a Key Role

టాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న కల్ట్ మిస్టరీ థ్రిల్లర్ ఫ్రాంచైజ్ ‘పొలిమేర’. ‘మా ఊరి పొలిమేర 1’, ‘ పొలిమేర 2’ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించిన తర్వాత, ఇప్పుడు మరింత భారీ స్థాయిలో ‘ పొలిమేర 3’ రూపుదిద్దుకుంటోంది.ఈసినిమా ఈరోజు సికంద్రాబాద్ లోని ఓ ఆలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ గ్రాండ్ థ్రిల్లర్‌లో కోలీవుడ్ యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కీలక పాత్రలో నటించబోతున్నారు.మొదటి రెండు భాగాల్లో తన విలక్షణ న
టనతో భయపెట్టిన సత్యం రాజేష్ హీరోగా నటిస్తుండగా, ఆయనతో పాటు యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఒక పవర్‌ఫుల్ అండ్ ఇన్వెస్టిగేటివ్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం.

దర్శకుడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ భాగాన్ని మునుపటి చిత్రాల కంటే అత్యంత భారీ బడ్జెట్‌తో మరియు అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నారు.వంశీ నందిపాటి ,జాన్వీ నారంగ్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు.

ఈ మూడో భాగంలో ‘చేతబడి’, ‘చేతబడికి సంబంధించిన రహస్యాల’ కాన్సెప్ట్‌ను మరింత డీప్‌గా, ఇంటర్నేషనల్ ఎలిమెంట్స్‌ను జోడించి నెక్స్ట్ లెవెల్‌లో చూపించబోతున్నారు.అర్జున్ సర్జా లాంటి సీనియర్ స్టార్ హీరో ఈ ప్రాజెక్ట్‌లో చేరడంతో ‘పొలిమేర 3’పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.