ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ విడుదల సందర్భంగా హైదరాబాద్‌లోని అల్లు సినిమాస్ (భారతదేశంలోనే అతిపెద్ద, అత్యాధునిక డాల్బీ సినిమా స్క్రీన్)లో గ్రాండ్ ప్రీమియర్ నిర్వహించారు. ఈ ప్రత్యేక ప్రీమియర్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య స్నేహా రెడ్డి, పిల్లలతో కలిసి హాజరై సందడి చేశారు. అభిమానులు ఈ అరుదైన ఫ్యామిలీ మూమెంట్‌ను ఆసక్తిగా స్వాగతించగా, సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ వేడుకకు అల్లు అరవింద్, అల్లు శిరీష్, బన్నీ వాస్, దర్శకులు చందూ మొండేటి, సాయి రాజేష్, హరీష్ శంకర్, బోయపాటి శ్రీను, నటి రష్యా గోరక్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవి, హారిక & హాసిని క్రియేషన్స్‌కు చెందిన నిర్మాత చిన్నబాబు, ఆస్కార్ విజేత నిర్మాత గునీత్ మోంగా తదితరులు హాజరయ్యారు. సినీ ప్రముఖుల సందడితో ప్రీమియర్ మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తెలుగు రాష్ట్రాల్లో *స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’* పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుండగా, విడుదలైన తొలి రోజే పలు ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ ప్రదర్శనలతో సినిమా దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ చిత్రం ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో దేశవ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























