మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “రౌద్రం రణం రుధిరం ” మూవీ లో అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న “ఆచార్య ” మూవీ లో రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటించనున్నారు. రామ్ చరణ్ ఇప్పుడు ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరో గా రూపొందిన “జెర్సీ “మూవీ ఘనవిజయం సాధించింది. గౌతమ్ ప్రస్తుతం షాహిద్ కపూర్ హీరోగా “జెర్సీ”హిందీ రీమేక్ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో గౌతమ్ ఒక కొత్త స్క్రిప్ట్ ను రెడీ చేశారు . ఆ స్క్రిప్ట్ ను రామ్ చరణ్ కు వినిపించగా రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలోనే ఈ మూవీ కి సంబంధించిన అన్ని వివరాలు వెల్లడికానున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: