యువ కథానాయకుడు నిఖిల్ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిన చిత్రాల్లో ‘కార్తికేయ’ ఒకటి. 2014లో విడుదలైన ఈ థ్రిల్లర్ మూవీతో చందు మొండేటి దర్శకుడిగా తొలి అడుగు వేశాడు. కట్ చేస్తే.. ఆరేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత నిఖిల్, చందు కాంబినేషన్‌లో మరో చిత్రం రాబోతోంది. ‘కార్తికేయ’కి సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇటీవల ఓ దిన పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చందు మొండేటి ‘కార్తికేయ 2’కి సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘కార్తికేయ’కి పక్కా కొనసాగింపు చిత్రంగా ‘కార్తికేయ 2’ ఉంటుందని.. కథానాయకుడు, అతని కుటుంబం, స్నేహితులు మొదటి సినిమాలో ఉన్నట్టే ఇందులోనూ ఉంటారని తెలిపాడు. కాకపోతే ఇందులో కథానాయకుడికి ఓ కొత్త సమస్య ఉంటుందని.. తొలి సినిమాలో గుడి సమస్య అయితే సీక్వెల్‌లో అంతకంటే పెద్ద సమస్య ఉంటుందని చెప్పుకొచ్చాడు. అలాగే, కథానాయకుడు నిఖిల్ పాత్ర సబ్జెక్టు డిమాండ్ మేరకు పెద్ద సాహసం చేయాల్సి వస్తుందని, అదెలా చేశాడన్నదే ‘కార్తికేయ 2’ అని ముక్తాయించాడు చందు.
మరి.. ‘కార్తికేయ’ లాగే ‘కార్తికేయ 2’ కూడా ఘనవిజయం సాధిస్తుందేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































