సుమంత్ హీరోగా ఈవిన్ నిర్మాణంలో తెరకెక్కిన యూనిక్ థ్రిల్లర్ ‘న్యూటన్స్ థర్డ్ లా’. రాజేశ్ కర్ణ దర్శకత్వం వహించిన చిత్రాన్ని కె.హరీశ్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 31న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ప్రిమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా మేకర్స్ యాక్షన్ రియాక్షన్ ఈవెంట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రెస్ మీట్ లో హీరో సుమంత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మా టీమ్ మొత్తానికి థ్యాంక్స్. రాజేష్ ‘అనగనగా’ సినిమాకు ముందే ఈ కథను నాకు చెప్పారు. మంచి నిర్మాత కోసం ఎదురుచూశాం. ‘అనగనగా’ ఈటీవీ విన్‌లో పెద్ద హిట్ అయిన తర్వాత వాళ్లే ముందుకు వచ్చి ఈ సినిమా చేశారు. వాళ్లకు ఈ కథ చాలా నచ్చింది. ఇది కొత్త తరహా థ్రిల్లర్ అయినప్పటికీ, ఇందులో బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. నేను కథ విన్నప్పుడు ఎంత ఎగ్జైట్ అయ్యానో, సినిమా చూస్తున్నప్పుడు కూడా అంతే ఎగ్జైటింగ్‌గా అనిపించింది. రాజేష్ చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. తనకు మంచి భవిష్యత్తు ఉంది. రవివర్మ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వినయ్ తన పాత్రను చాలా చక్కగా చేశారు. ఆ పాత్ర నాకు చాలా నచ్చింది. అలాగే కార్తీక్ పాత్ర కూడా చాలా బాగుంటుంది. నేహా పాత్ర కూడా చాలా బాగా కుదిరింది. ఇందులో అన్ని పాత్రలకు సమాన ప్రాధాన్యత ఉంటుంది.
నిన్న ప్రీమియర్స్‌కు చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ప్రొడక్షన్ డిజైన్‌పై ప్రశంసలు వచ్చాయి. అందుకు మా నిర్మాతలకు, ఈటీవీ విన్‌కు థ్యాంక్స్. ఈ సినిమాకు డీఓపీ మా కజిన్. ఆయన ఈ సినిమాకు ఎంపికైన తర్వాతే నాకు తెలిసింది. మంచి సినిమా చేశాం. ఇది ఫ్యామిలీ డ్రామాతో కూడిన చాలా డిఫరెంట్ థ్రిల్లర్. మంచి ఎమోషన్ కూడా ఉంటుంది. మన సంస్కృతికి సంబంధించిన అంశాలను, క్యారెక్టర్లను సింబలైజ్ చేస్తూ ఈ సినిమా తీశారు. ఆ అందాన్ని మీరు థియేటర్‌లో చూస్తారు. తప్పకుండా ఈ సినిమాను సపోర్ట్ చేయండి. ఈ సినిమా మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశపరచదు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























