కొత్త సినిమాపై వస్తున్న రూమర్లకు చెక్..!

Actor Siddharth Quashes Rumours Of Releasing His New Movie Takkar On OTT Platforms
Actor Siddharth Quashes Rumours Of Releasing His New Movie Takkar On OTT Platforms

ఇటీవలే ‘వదలడు’ సినిమాతో వచ్చిన సిద్దార్ధ్ ఇప్పుడు తాజాగా మరో డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడు. జి క్రిష్ దర్శకత్వంలో సిద్దార్ధ్, దివ్యాంశ కౌశిక్ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా ‘టక్కర్’. నిజానికి ఈ సినిమా ఈ నెలలో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ తెలిసిందే కదా కరోనా వల్ల రిలీజ్ కు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో అన్ని సినిమాలకు వస్తున్నట్టే… ఈ సినిమాకు పై కూడా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే సిద్దార్ధ ఈ వార్తలన్నిటినీ ఖండించాడు. తమ సినిమా థియేటర్ లోనే రిలీజ్ అవుతుందని.. ఎప్పుడు లాక్ డౌన్ అయిపోయి ఎప్పుడు థియేటర్స్ ఓపెన్ చేస్తారో అప్పటి వరకూ వెయిట్ చేస్తామని చెప్పాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంకా ఈ సినిమాలో అభిమన్యు సింగ్, యోగిబాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్‌పై సుధన్ సుందరం, జయరాం నిర్మించిన ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. నివాస్ కె ప్రసన్న ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.

‘బోయ్స్’, ‘బొమ్మరిల్లు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’,’ఓయ్’ ఇలా తన సినిమాలతో ప్రేక్షకులను మెప్పించి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్నాడు సిద్ధార్థ్. ఇక ప్రస్తుతం వున్న పోటీ వాతావరణంలో కాస్త వెనకబడిపోయాడు. అప్పుడప్పుడు ఒక్కో సినిమాతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.