విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న ప్రతిష్టాత్మక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం’ తాజాగా ఈ చిత్రం నుంచి వినోదాత్మక ప్రమోషన్స్‌ను కొనసాగిస్తూ, కథలో కీలకమైన ‘సంపూర్ణ’ పాత్ర పరిచయ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రంలో చిట్టిబాబు (వెంకటేష్) ముద్దుల కూతురు ‘సంపూర్ణ’ పాత్రలో బాలనటి యువీనా పార్థవి నటిస్తోంది. విడుదలైన ఇంట్రో వీడియోలో తండ్రీకూతుళ్ల మధ్య సాగే సరదా సంభాషణలు, హౌస్‌హోల్డ్ కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. త్రివిక్రమ్ మార్క్ ప్రాసలు, వెంకీ వింటేజ్ కామెడీ టైమింగ్ ఈ వీడియోకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
శ్రీనిధి శెట్టి, నారా రోహిత్, నివేథా పేతురాజ్, రావు రమేష్, సత్య తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 2 న థియేటర్లలోకి రానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























