అక్కినేని నాగార్జునకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్న గ్రామీణ నేపథ్య వినోదాత్మక చిత్రం ‘పళ్ళబురుసు’ టీజర్‌ను యంగ్ హీరో నాగ చైతన్య సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఓ సాధారణ పల్లెటూర్లో 68 ఏళ్ల వృద్ధుడు (సుధాకర్ రెడ్డి) తన పళ్ళు తోముకోవడానికి వేపపుల్ల వల్ల పడే బాధ భరించలేక తన కొడుకును ఒక ‘పళ్ళబురుసు’ (టూత్ బ్రష్) కొనివ్వమని అడిగే చిన్న కోరిక, ఆ బ్రష్ చుట్టూ కోర్టు కేసులు, తండ్రీకొడుకుల గొడవలు మరియు గ్రామీణ రాజకీయాలు ఎలా తిరిగాయనేది వినోదాత్మకంగా, ఎమోషనల్‌గా టీజర్లో చూపించారు. పవన్ సీహెచ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిన ఈ రూరల్ కామెడీ అండ్ డ్రామా చిత్రం స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























