జూలై లో చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది హిందీ సినిమా సైయారా .ఎక్స్ లెంట్ రివ్యూస్ ను సొంతం చేసుకోవడంతో మొదటి మూడు రోజుల్లోనే 100కోట్ల మార్క్ ను క్రాస్ చేసి సెన్సేషన్ సృష్టించగా ఆతరువాత అదే జోరు కొనసాగించి 500 కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.కేవలం సింగిల్ లాంగ్వేజ్ లో రిలీజై ఈ ఫీట్ సాధించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అంతేకాదు ఈ ఏడాది ఛావా తరువాత 500 కోట్ల క్లబ్ లో రెండో హిందీ సినిమాగా సైయారా రికార్డు సృష్టించింది.ఇక ఈసినిమా 56 రోజుల థియేట్రికల్ రన్ తరువాత ఓటీటీలోకి రానుంది.ఈరోజు అర్ధరాత్రి 12గంటల నుండి నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది. అయితే కేవలం హిందీ ఆడియోతో అందుబాటులో ఉంచనుంది.
లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో అహాన్ పాండే ,అనీత్ పడ్డా జంటగా నటించిన ఈసినిమాను మోహిత్ సూరి తెరకెక్కించారు.హీరో హీరోయిన్ ఇద్దరికి ఇదే మెదటి సినిమా కావడం విశేషం. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ ఈసినిమాను నిర్మించింది.ఈసినిమా నిర్మాతలకు భారీ లాభాలను తీసుకొచ్చింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























