మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ,హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే జంటగా తమిళ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కిస్తున్న సినిమా కాంత.దగ్గుబాటి రానా ఈసినిమాకు ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.1950 పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథతో వస్తుంది.షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.అయితే ఈసినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ కావాల్సివుండగా వాయిదాపడిందని రీసెంట్ గానే వార్తలు వచ్చాయి.ఇదే విషయాన్ని మేకర్స్ ఈరోజు అఫీషియల్ గా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దుల్కర్ నిర్మాతగా మలయాళంలో వచ్చిన లోకః సినిమా బాక్సాఫీస్ వద్ద రాంపేజ్ వసూళ్లతో దూసుకుపోతుంది.రెండు వారాల్లోనే 200 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి దుల్కర్ కి భారీ లాభాలు తీసుకొస్తుంది. దుల్కర్ ప్రస్తుతం ఈసినిమా సక్సెస్ ను ఎంజాయి చేస్తున్నాడు. ఇక ఈసినిమా లాగే కాంత కూడా మీకు ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చేలా సిద్ధం చేస్తున్నాం.అందువల్ల కాస్త ఆలస్యం అవుతుంది.త్వరలోనే మరో డేట్ ను ప్రకటిస్తాం అని మేకర్స్ ప్రకటించారు.దీపావళికి కాంతను రిలీజ్ చేసే అవకాశాలు వున్నాయి. ఈసినిమా నుండి రీసెంట్ గా టీజర్ రిలీజ్ అవ్వగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని అంచనాలను పెంచేసింది.
ఇక దుల్కర్ ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాడు.అందులో ఆకాశంలో ఒక తార ఒకటి. పవన్ సాధినేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో సాత్విక వీరవల్లి హీరోయిన్ గా నటిస్తుంది.రమ్య గుణ్ణం,సందీప్ గుణ్ణం నిర్మిస్తున్నారు.ఈ ఏడాది చివర్లో విడుదలకానుంది.ఈసినిమాతో పాటు దుల్కర్ లవ్ స్టోరీ నేపథ్యంలో రవి నెలకుడిటి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.పూజా హెగ్డే ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది.సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























