కన్నడ నుండి నెక్స్ట్ వస్తున్న భారీ చిత్రం కాంతార ఏ లెజండ్ – చాప్టర్ 1.అక్టోబర్ 2 న విడుదలకానుంది. దాదాపు మూడేళ్ళ క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బిగెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది కాంతార.ఒక్క కన్నడ లోనే తెలుగు ,హిందీ భాషల్లో కూడా సెన్సేషన్ సృష్టించింది. ఇక ఈసినిమాకు ప్రీక్వెల్ గా వస్తుంది కాంతార చాప్టర్ 1.ఫస్ట్ పార్ట్ తోపోలిస్తే బడ్జెట్ భారీగా పెరిగింది.ఈసినిమాపై అంచనాలు ఓరేంజ్ లో వున్నాయి. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే 1000 కోట్ల సినిమా అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి ఇప్పటివరకు మేజర్ అప్డేట్ ఏమి రాలేదు.అయినా కానీ సినిమాకు వున్న హైప్ దృష్ట్యా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతుంది.అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ట్రైలర్ ను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.అన్ని కుదిరితే ఈనెల 20న కాంతార చాఫ్టర్ 1 ట్రైలర్ రిలీజ్ కానుంది.ఈసినిమా ఓటీటీ డీల్ కూడా పూర్తయినట్లు వార్తలు వస్తున్నాయి.అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకుందట.
ఇక పోస్ట్ ప్రొడక్షన్ విషయానికి వస్తే ప్రస్తుతం ఫైనల్ కాపీని రెడీ చేసే పనిలో వుంది టీమ్.ఈసినిమా విఎఫ్ఎక్స్ కోసం ఏకంగా 20 కంపెనీలు పనిచేస్తున్నాయి.రిషబ్ శెట్టి డైరెక్ట్ చేస్తూ నటించిన ఈసినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























