రణబాలిలో విజయ్ విశ్వరూపం చూస్తారు – డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్

టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించిన పీరియాడిక్ ఎపిక్ డ్రామా ‘రణబాలి’. ఈ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుకలో దర్శకుడు మాట్లాడుతూ సినిమా వెనుక ఉన్న కథా నేపథ్యాన్ని, విజయ్ దేవరకొండ నటనను కొనియాడారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాహుల్ సాంకృత్యాన్ మాట్లాడుతూ — “ఈ సినిమా పనుల వల్ల గత కొద్దిరోజులుగా సరిగా నిద్ర కూడా లేదు. నా తొలి హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమాలో ఒక యోధుడి పాత్ర అనగానే నాకు వెంటనే విజయ్ గుర్తొచ్చాడు. తెరపై విజయ్ దేవరకొండ విశ్వరూపం చూపించాడు. రాయలసీమ యాస, వాయిస్ ఆక్యురేసీ కోసం ఆయన ఎంతో సాధన చేశారు. థియేటర్లలో ఆయన్ను చూస్తే ఫ్యాన్స్‌కు ఒక పెద్ద సంబరంలా ఉంటుంది” అని అన్నారు.

కథాంశం గురించి వివరిస్తూ — “చరిత్ర పుటల్లో మనకు తెలియకుండా దాచిపెట్టిన ఒక భయంకరమైన అంకాన్ని ఈ చిత్రం ద్వారా ముందుకు తెస్తున్నాం. 150 ఏళ్ల క్రితం ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరవు వస్తే, దాన్ని ఆయుధంగా మార్చుకుని బ్రిటిషర్లు దాదాపు 80 లక్షల మందిని చంపేశారు. ఆ దారుణమైన చరిత్రను మనం మర్చిపోతే మళ్లీ పునరావృతమవుతుంది. ఆ సత్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే లక్ష్యంతోనే ఈ చిత్రాన్ని నాలుగేళ్లు శ్రమించి తీశాం. కచ్చితంగా ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది” అని ధీమా వ్యక్తం చేశారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.