రీసెంట్ గా వచ్చిన కన్నడ యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ ఏ రేంజ్ సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఎలాంటి అంచనాలు లేకుండా పాన్ ఇండియా భాషల్లో వచ్చిన ఈసినిమా 300 కోట్ల వరకు రాబట్టి అత్యధిక వసూళ్లను రాబట్టిన ఇండియన్ యానిమేటెడ్ మూవీగా రికార్డు సృష్టించింది.ఇప్పటికీ ఈసినిమా డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తెలుగులో కూడా భారీ 3డి యానిమేషన్ సినిమా రానుంది.హనుమాన్ చరిత్ర ఆధారంగా వాయుపుత్ర అనే యానిమేషన్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు చందు మొండేటి.తండేల్ సక్సెస్ తరువాత చందు నుండి వస్తున్న సినిమా ఇదే.భారీ బడ్జెట్ తో సితార ఎంటర్టైన్మెంట్స్ ఈసినిమాను నిర్మిస్తుంది. ఈరోజు ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
అంతేకాదు రిలీజ్ ఎప్పుడో కూడా చెప్పేశారు.వచ్చే ఏడాది దసరాకు తెలుగు తోపాటు తమిళ , కన్నడ, మలయాళ ,హిందీ భాషల్లో ఈసినిమా థియేటర్లోకి రానుంది.తెలుగు సినిమా చరిత్రలోనే భారీ 3డి యానిమేటెడ్ సినిమాగా వాయుపుత్ర రూపొందనుంది.మరి ఈసినిమా మరో మహావతార్ నరసింహ అవుతుందో చూడాలి.త్వరలోనే వాయుపుత్ర గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























