సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ తో మలయాళంలో తెరకెక్కిన లోకః చాప్టర్ 1 – చంద్ర బాక్సాఫీస్ వద్ద రాంపేజ్ కొనసాగిస్తోంది.మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చినా ఎక్కడా స్లో అవ్వకుండా వసూళ్లను రాబట్టుకుంటుంది. ఇక సినిమా 13 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 202 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుందని మేకర్స్ ప్రకటించారు .దాంతో మాలీవుడ్ లో 200కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మూడో సినిమాగా రికార్డు సృష్టించింది. అంతేకాదు ఈ ఫీట్ సాధించిన ఫస్ట్ సౌత్ ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీగా కూడా రికార్డు సృష్టించింది. ట్రెండ్ చూస్తుంటే ఫుల్ రన్ లో ఈసినిమా 250 కోట్ల మార్క్ ను క్రాస్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా కేవలం మలయాళం లోనేకాదు తెలుగులోనూ అదరగొడుతుంది.తెలుగులో కొత్త లోక గా విడుదలకాగా బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకొని క్లీన్ హిట్ గా నిలిచింది. ప్రముఖ నిర్మాత సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ ఈసినిమాను తెలుగులో రిలీజ్ చేయగా ఫుల్ రన్ లో మంచి లాభాలను అందుకోనున్నారు.
యువ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ లో నటించిన ఈసినిమాను డొమినిక్ అరుణ్ తెరకెక్కించాడు.జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా ప్రేమలు ఫేమ్ నస్లేన్ కీలక పాత్రలో కనిపించాడు. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ దాదాపు 30కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మించాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























