రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన మోస్ట్ ఎవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ విడుదలకు ముందు ఎటువంటి అడ్డంకులు లేకుండా సెన్సార్ను క్లియర్ చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
19వ శతాబ్దపు బ్రిటిష్ పాలన, అణచివేత మరియు కొన్ని సున్నితమైన రాజకీయ, సామాజిక అంశాల నేపధ్యంలో తెరకెక్కినప్పటికీ, బోర్డు సభ్యులు ఈ చిత్రానికి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడం విశేషం. బోర్డు సభ్యులు ఒక్క కట్ కూడా సూచించకుండా క్లీన్ U/A సర్టిఫికేట్ జారీ చేశారు.
ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 50 నిమిషాలు (170 నిమిషాలు) గా లాక్ అయ్యింది. నిడివి కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ, కథలోని రౌద్రం, డ్రామా మరియు కథనం ప్రేక్షకులను కట్టిపడేసేలా తీర్చిదిద్దారని సెన్సార్ వర్గాల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 16న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























