రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన మోస్ట్ ఏవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రణబాలి’ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ మంగళవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేదికపై విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు, ఫ్యాన్స్కు ఇచ్చిన ప్రామిస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ — “గతంలో ‘నోటా’ ఫ్లాప్ అయినప్పుడు అభిమానులకు ఒక లెటర్ రాశాను.. ‘ఐ విల్ బి బ్యాక్’ అని. ఇప్పుడు ఈ ‘రణబాలి’ సినిమాతో ఆ మాటను నిలబెట్టుకుని తీరుతాను. దర్శకుడు రాహుల్ మీద నాకు అంత నమ్మకముంది. మన చేతిలో ఉండేది రెండే.. పనిపై ప్రాణం పెట్టడం, మనపై మనకు నమ్మకం ఉంచడం. తిరుపతిలో బ్రహ్మోత్సవాలు, తెలంగాణలో బతుకమ్మ వేడుకల సందడి నడుస్తోంది.. అక్టోబర్ 16న ‘రణబాలి’తో థియేటర్లలో ఆ పండుగ వాతావరణం రెట్టింపు కాబోతోంది” అని ధీమా వ్యక్తం చేశారు.
ఇక హీరోయిన్ రష్మిక గురించి చెబుతూ — “రష్మికా.. ఇది మన మూడో సినిమా. ఈ మూడేళ్లలో నువ్వు నటిగానే కాదు, వ్యక్తిగానూ ఎంతో ఎదిగావు. ఒక మనిషిలా కాకుండా రోబోలా నిరంతరం శ్రమిస్తుంటావు. నీ ఎదుగుదల చూస్తుంటే నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది. నువ్వే నా ఫేవరెట్ కో-స్టార్. సినిమాలో ‘జయమ్మ’ పాత్రకు నువ్వు కాకుండా వేరే ఎవరు చేసినా అంత ఇంపాక్ట్ వచ్చేది కాదు” అని ప్రశంసల వర్షం కురిపించారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























