ఘాటి రిలీజ్ గ్లింప్స్ విడుదల చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

Anushka Shetty's GHAATI Release Glimpse Launched by Rebel Star Prabhas

లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఘాటి’. విక్రమ్ ప్రభు, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. UV క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. ఇప్పటికే అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రేపు (సెప్టెంబర్ 5) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ సందర్భంగా, మేకర్స్ తాజాగా ఈ మూవీ రిలీజ్ గ్లింప్స్‌ను విడుదలచేశారు. ఈ మేరకు నేడు రెబల్ స్టార్ ప్రభాస్ చేతులమీదుగా దీనిని లాంచ్ చేసి సినిమాకు భారీ హైప్ ఇచ్చారు. రిలీజ్ గ్లింప్స్‌ అయితే అదిరిపోయింది. మూవీ కాన్సెప్ట్ ఏంటనేది మరింత విపులంగా వివరించింది.

ఇక ఈ గ్లింప్స్‌లో అనుష్క లుక్, గెటప్, యాక్షన్ సన్నివేశాలలో ఆమె గంభీరమైన నటన అందరినీ ఆకట్టుకున్నాయి. పవర్‌ఫుల్ విజువల్స్, మరియు థ్రిల్లింగ్ సన్నివేశాలతో రిలీజ్ గ్లింప్స్‌ అంచనాలను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. ఇది చూసిన తర్వాత ఘాటి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం నమోదు చేయడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇక గతంలో ‘వేదం’, ‘కొండపొలం’ లాంటి విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాను ప్రత్యేకమైన కోణంలో తెరకెక్కించారు. ఈ సినిమాతో ప్రేక్షకులు ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తారని, మరియు ఒక కొత్త తరహా యాక్షన్ థ్రిల్లర్‌ను అనుభవిస్తారని ఇప్పటికే ఆయన హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ రిలీజ్ గ్లింప్స్‌ చూసిన తర్వాత ఘాటి అనుష్క కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలవడం ఖాయం అని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.