2018లో విడుదలై కల్ట్ క్లాసిక్‌గా గుర్తింపు తెచ్చుకున్న ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఈఎన్ఈ రిపీట్’ రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నలుగురు యువకులు సూట్‌కేసులు, ట్రావెల్ బ్యాగులు, కెమెరా పరికరాలు, ఇతర లగేజీ మధ్య కనిపిస్తున్నారు. ప్రతి ఒక్కరి లుక్, హావభావాలు ప్రత్యేకంగా ఉండటంతో పోస్టర్ ఆసక్తికరంగా, వినోదాత్మకంగా కనిపిస్తోంది.ఇక ఈ పోస్టర్ రిలీజ్ డేట్ మరోసారి కన్ ఫర్మ్ చేశారు. నవంబర్ 19న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విశ్వక్ సేన్ సన్‌గ్లాసెస్ ధరించి, చేతిలో బ్రౌన్ లెదర్ బ్యాగ్‌తో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. బ్లూ టీ-షర్ట్, కళ్లద్దాలతో ఉన్న వెంకటేష్ కాకుమాను సూట్కేసుకు ఆనుకుని ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఎడమవైపు ప్రొఫెషనల్ కెమెరా, ట్రైపాడ్ పట్టుకున్న శ్రీనాథ్ మాగంటి.. ఫిల్మ్ మేకింగ్ లో తన పాత్రకు ఉన్న అనుబంధాన్ని సూచిస్తున్నారు. మధ్యలో గ్రీన్ షర్ట్‌లో ఉన్న అభినవ్ గోమఠం చేతిలో ఓ కాగితం పట్టుకుని ఆశ్చర్యపోయినట్లు కనిపిస్తున్నారు. పాత్రలు, లగేజీతో నిండిన ఈ పోస్టర్ గందరగోళం, కామెడీతో కూడిన కథను సూచిస్తూ ఆసక్తిని పెంచుతోంది.
ఈ సినిమాలో విశ్వక్ సేన్ వివేక్‌గా, అభినవ్ గోమఠం కౌశిక్‌గా, వెంకటేష్ కాకుమాను ఉప్పిగా, శ్రీనాథ్ మాగంటి కార్తీక్‌గా అలరించనున్నారు. తొలి పార్ట్ లో తమ స్నేహం, కామెడీతో యువ ప్రేక్షకులకు దగ్గరైన ఈ నలుగురి గ్యాంగ్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
2018లో విడుదలైన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. సహజమైన పాత్రలు, యూత్‌ఫుల్ హ్యూమర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇటీవల ఈ సినిమా థియేటర్లలో రీరిలీజ్ విజయవంతం కావడం, ప్రేక్షకుల్లో దీనికి ఉన్న ఆదరణను మరోసారి నిరూపించింది.ఈ చిత్రానికి ఏజే ఆరోన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























