కిష్కింధపురి రిలీజ్ డేట్ మారింది

Kishkindhapuri Gets a New Release Date

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – అనుపమ జంటగా చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా కిష్కింధపురి.హారర్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి.ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు అయితే సూపర్ రెస్పాన్స్ వచ్చింది .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ఈనెల 12న విడుదలకావాల్సి ఉండగా ఇప్పుడు ఆడేట్ మార్చారు. ఒక్క రోజు ఆలస్యంగా ఈనెల 13న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నామని ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా ఈరోజు మేకర్స్ ప్రకటించారు.అయితే రిలీజ్ డేట్ మార్చడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. మరి ఇదే డేట్ కి స్టిక్ అయ్యి వుంటారా లేదా ముందు చెప్పినట్లు 12నే వస్తారో చూడాలి.

ఇక ట్రైలర్ రిలీజ్ డేట్ కూడా చెప్పాల్సివుంది. ప్రస్తుతం టీం అయితే ప్రమోషన్స్ చేస్తున్నారు. సామ్ సీఎస్ ,చైతన్య భరద్వాజ్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇక  ఈసినిమాతో హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు సాయి శ్రీనివాస్.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.