తమిళ హీరో కార్తీ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు వున్నాయి. అందులో వా వాతియార్ ఒకటి. నలన్ కుమారస్వామి డైరెక్ట్ చేస్తున్నాడు.ఇందులో కార్తీ డిఫ్రెంట్ రోల్ లో కనిపించనున్నాడు. ఇక ఈసినిమా ఆగిపోయిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో రిలీజ్ ఎప్పుడో ప్రకటించారు మేకర్స్. డిసెంబర్ లో ఈసినిమా థియేటర్లలోకి రానుంది.నిజానికి ఎప్పుడో విడుదలకావల్సిన ఈసినిమాకు మధ్యలో అనేక అడ్డంకులు వచ్చాయి. దాంతో షూటింగ్ పూర్తి కావడం ఆలస్యం అవుతూ వచ్చింది.ఇక ఎట్టకేలకు ఈసినిమా విషయంలో మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.స్టూడియో గ్రీన్ ఈసినిమాను నిర్మిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.కృతి శెట్టి ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా కన్నా ముందే కార్తీ ,సర్దార్ 2 ఫినిష్ చేశాడు.ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో వుంది.మిత్రన్ డైరెక్ట్ చేస్తుండగా మాళవిక మోహనన్ ,ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ప్రిన్స్ పిక్చర్స్ నిర్మిస్తుంది.2022లో వచ్చిన సర్దార్ బ్లాక్ బస్టర్ కావడంతో సర్దార్ 2పై భారీ అంచనాలు వున్నాయి.
ఇక కార్తీ ప్రస్తుతం మార్షల్ అనే సినిమా కూడా చేస్తున్నాడు.తమిళ్ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తుంది. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు.డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది ప్రథమార్థంలో రవిడుదలకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























