డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాతగా వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. ఈ సినిమాతో అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, డెబ్యూ దర్శకుడు మహేష్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్నారు. అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. తమన్ ఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు. టైటిల్ గ్లింప్స్, ఇప్పటికే విడుదలైన రెండు పాటలు, ఇతర ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచింది. ఈ సినిమా అక్టోబర్ 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ రోజు మేకర్స్ వైజాగ్ గీతం యూనివర్సిటీలో యెల్లో చున్ని సాంగ్ లాంచ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తమన్ ఎస్ బ్యూటిఫుల్ మెలోడీని కంపోజ్ చేశారు. ఈ పాటను తమన్, విశాల్ మిశ్రా కలిసి ఆలపించగా, శ్రీజో లిరిక్స్ ఆకట్టుకున్నాయి. అనీష్, అనస్వర రాజన్ తమ స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చారు. అనీష్ డ్యాన్స్ మూమెంట్స్ ప్రత్యేకంగా అలరించాయి. బ్యూటిఫుల్ మెలోడీ, హీరోహీరోయిన్ల కెమిస్ట్రీతో పాట అదిరిపోయింది. ఇప్పటికే ఈ సాంగ్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటూ ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేస్తోంది.
సాంగ్ లోంచి ఈవెంట్లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ.. ‘ఇట్లు అర్జున’ లవ్లీ జర్నీ. లవ్ స్టోరీ అంటే చాలా ఇష్టం. సాధారణంగా ‘ థియేటర్లు, పగిలిపోవాలి, స్పీకర్లు కాలిపోవాలి’ అని నాకు మెసేజ్‌లు పెడుతుంటారు. కానీ మహేష్ వచ్చి ‘గుండె పగిలిపోవాలి’ అని చెప్పాడు. అలాంటి కథలు వచ్చినప్పుడు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. మహేష్‌కి థాంక్యూ. చాలా కొత్త కంటెంట్. ఇందులో అనిరుధ్ పాడిన ‘హాయ్ రే’ పాటకి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే ‘చిన్ని చిన్ని’ పాటని మోహిత్ పాడారు. ఇది కాకుండా ఇంకో పాట ఉంది. అది ఒక బిగ్ స్టార్ పాడుతున్నారు. అనీష్ అనస్వర అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. అక్టోబర్ 30న ‘ఇట్లు అర్జున’ సినిమా థియేటర్‌లోకి వస్తుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























