ఉస్తాద్ భగత్ సింగ్.. అదిరిపోయిన పవన్ కళ్యాణ్ బర్త్ డే పోస్టర్‌

Power Star Pawan Kalyan's Birthday Special Poster Released From Ustaad Bhagat Singh

రేపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులకు ఒకరోజు ముందే పండుగ వచ్చేసింది! పవన్ నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్‘ సినిమా నుండి చిత్రబృందం వారికి ఒక అద్భుతమైన బహుమతిని ఇచ్చింది. పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా నుంచి ఈరోజు ఒక అదిరిపోయే పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్ చూసి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అదిరిపోయిన పవన్ కళ్యాణ్ లుక్

విడుదలైన పోస్టర్లో పవన్ కళ్యాణ్ మాస్ అవతార్‌లో కనిపించారు. ఈ పోస్టర్‌లో పవన్ ఫుల్ బ్లాక్ డ్రెస్‌లో తలపైన కౌ-బాయ్ క్యాప్ పెట్టుకుని ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. చూస్తుంటే, ఇది పాటలో భాగంగా వచ్చే స్టిల్ అని అర్ధమవుతోంది. ఈ లుక్ ఆయన అభిమానులకే కాకుండా మూవీ లవర్స్ అందరికీ కూడా చాలా నచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అంచనాలు పెంచిన కాంబో

దశాబ్ద కాలం తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ మళ్లీ కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఈ కాంబో మళ్లీ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పోస్టర్‌తో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి.

ఇక మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ త్వరలో షూటింగ్ పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ పుట్టినరోజు పోస్టర్‌ను చూసిన అభిమానులు పవన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.