ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. పవన్ కళ్యాణ్ కేవలం ఒక సినిమా హీరో మాత్రమే కాదు, ఆయన ఒక తరం ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసిన ఒక నాయకుడు, రియల్ హీరో. ఆయన జీవితం, సినీ ప్రయాణం, రాజకీయ రంగ ప్రవేశం… అన్నీ కూడా ప్రత్యేకమైనవే. నేడు పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఆయనపై స్పెషల్ స్టోరీ..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అన్నయ్య వారసత్వం.. సినీ ప్రస్థానం
కొణిదెల వెంకట్రావు, అంజనాదేవిల మూడవ కుమారుడైన కొణిదెల కళ్యాణ్ బాబు.. అన్నయ్యలు మెగాస్టార్ చిరంజీవి, నాగబాబుల స్ఫూర్తితో సినీ రంగ ప్రవేశం చేశారు. 1996లో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో హీరోగా పరిచయమై, తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే, 1998లో వచ్చిన ‘తొలిప్రేమ’ సినిమా పవన్‌కు స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. ఈ సినిమా ఒక కొత్త తరహా ప్రేమకథతో యువతను విశేషంగా ఆకట్టుకుంది.
ఆ తర్వాత వచ్చిన ‘బద్రి, తమ్ముడు, ఖుషి, బాలు, జల్సా’ వంటి చిత్రాలు ఆయనను అగ్ర కథానాయకుడిగా నిలబెట్టాయి. తమ్ముడు, ఖుషి సినిమాల్లోని ఆయన మ్యానరిజమ్స్, స్టైల్ యువతను ఎంతగానో ప్రభావితం చేశాయి. ముఖ్యంగా, ఖుషి సినిమాలోని కొన్ని సన్నివేశాలు, పవన్ స్వాగ్ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది.
ఇలా దశాబ్దం పాటు సినిమాలు చేసి, కొంత గ్యాప్ తర్వాత ఆయన తిరిగి ‘గబ్బర్ సింగ్’ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశారు. ఈ సినిమా పవన్ అభిమానులకు ఒక పండుగలా నిలిచిపోయింది. ఇందులో ‘నాకుకొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది’.. ఇంకా ‘నేను ట్రెండ్ ఫాలో అవను, సెట్ చేస్తాను’ అనే డైలాగ్స్ అయితే సెన్సేషన్ సృష్టించాయి. ఆ తర్వాత వచ్చిన ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి పవన్ స్టామినా ఏంటో చూపించింది. ఆ తర్వాత వచ్చిన ‘వకీల్ సాబ్’ సినిమాలో ఆయన నటన అందరినీ ఆకట్టుకుంది.
పవర్ స్టార్ స్టైల్.. ఒక ట్రెండ్
పవన్ కళ్యాణ్ అంటేనే ఒక ప్రత్యేకమైన స్టైల్. ఆయన నడక, నవ్వు, మాట్లాడే విధానం.. అన్నీ కూడా ఒక ట్రెండ్‌గా మారాయి. ఆయన వేసుకునే దుస్తులు, కళ్లద్దాలు, చేతికి పెట్టుకునే కండువా.. ఇవన్నీ కూడా ఆయన అభిమానులకు ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ అయ్యాయి. సినిమాలో ఆయన ఫైట్స్, డైలాగ్స్ డెలివరీలో చూపించే ప్రత్యేకమైన శైలి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అందుకే, అభిమానులు ఆయనను ‘పవర్ స్టార్’ అని ముద్దుగా పిలుచుకుంటారు.
సామాజిక స్పృహ, రాజకీయ ప్రవేశం
సినీ జీవితంలోనే కాకుండా పవన్ కళ్యాణ్ సామాజిక బాధ్యతలో కూడా ముందుంటారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, ప్రజల సమస్యలపై ఆయన ఎప్పుడూ స్పందిస్తుంటారు. ఈ నేపథ్యంలో బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉండేందుకు 2014లో, ఆయన జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చారు.
ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా..
అయితే, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం అంత సులువుగా సాగలేదు. 2014లో టీడీపీ-బీజేపీకి మద్దతు తెలిపినప్పటికీ, 2019లో ఒంటరిగా పోటీ చేసి ఓటమిని చవి చూశారు. అయినప్పటికీ ఆయన నిరాశ చెందకుండా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడారు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పార్టీలతో కలిసి కూటమిగా పోటీ చేసి, పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలో తన పార్టీ 100% స్ట్రైక్ రేట్‌తో ఘన విజయం సాధించడంలో కీలక భూమిక పోషించారు.
ఈ విజయం తర్వాత, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల బాధ్యతలను చేపట్టారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా ముచ్చటించారు. మోదీ పవన్ కు చాక్లెట్ అందించి, ఆయనతో కాసేపు ప్రత్యేకంగా మాట్లాడటం జాతీయ మీడియాలో కూడా హైలైట్ అయ్యింది.
ఓజీ తో బాక్సాఫీస్ వద్ద విధ్వంసానికి అంతా సిద్ధం..
ఈనెల 25న పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘ఓజీ’ రిలీజ్ కాబోతోంది. ‘సాహో’ ఫేమ్ సుజీత్ రూపొందిస్తున్న ఈ సినిమాపై అంచనాలు స్కై లెవెల్లో ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలచేసిన ‘హంగ్రీ చీతా’ టీజర్, టైటిల్, పోస్టర్లు సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి.
కాగా, ఇందులో పవర్ స్టార్ ఒక గ్యాంగ్‌స్టర్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అజ్ఞాతంలో ఉన్న ఒక పవర్ఫుల్ మాఫియా డాన్‌గా కనిపించనున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ స్వాగ్, మ్యానరిజమ్లకు సంబంధించి సుజీత్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమా విడుదల కోసం, పవన్ అభిమానులు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ మొత్తం ప్రయాణంలో పవన్ కళ్యాణ్ అభిమానుల మద్దతు వెలకట్టలేనిది. ఆయన ఒక హీరోగా, ఒక రాజకీయ నాయకుడిగా ఈ స్థాయికి చేరుకోవడానికి అభిమానుల ప్రేమ, పిచ్చి అభిమానం ఒక ముఖ్య కారణం. అందుకే, దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆయనను తమ దేవుడిగా కొలుస్తారు. ఈ సందర్భంగా, పవన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన భవిష్యత్తులో మరింత విజయాలు సాధించాలని కోరుకుందాం..
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























