‘మండాడి’ బ్లాక్‌బస్టర్ విజయంతో జోష్‌లో ఉన్న యంగ్ హీరో సుహాస్ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రాజేంద్ర బాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో ఆయన కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. తమిళం, మలయాళంలో ఇప్పటికే 18 సినిమాలను నిర్మించిన స్టోన్ బెంచ్ స్టూడియో అధినేత కార్తికేయన్ సంతానం.. ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. నాలుగు సినిమాలతో తెలుగులో తన నిర్మాణ ప్రయాణాన్ని ప్రారంభించనున్న ఆయన, ఈ ప్రాజెక్ట్ కోసం మిస్రిలాల్ పిక్చర్స్ వర్తికా జైన్‌తో చేతులు కలిపారు. ‘లబ్బర్ పందు’, ‘డీసీ’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సంజన కృష్ణమూర్తి ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘హైడ్ & సిల్క్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ వీడియోలో సుహాస్ చీర నేస్తూ కనిపిస్తారు. ఆయనకు తోడుగా సీనియర్ నటుడు తనికెళ్ల భరణి ఇంటెన్స్ వాయిస్ వినిపిస్తుంది. ఆయన చెప్పే భావోద్వేగపూరితమైన మాటలు ఓ కవితాత్మక ఆలోచనను ఆవిష్కరిస్తాయి. ప్రతి చీర ఓ అమ్మాయిని ఎంచుకుంటుంది, దాని అందం కేవలం నేతపనిలోనే ఉండదని వాయిస్ ఓవర్ ప్రజెంట్ చేస్తోంది. చేనేత కళకు, విధికి మధ్య ఉన్న ఈ కవితాత్మకమైన అనుబంధం గ్లింప్స్‌కు ప్రత్యేకమైన ఎమోషనల్ టచ్ ను అందిస్తోంది.
మగ్గం ముందు సుహాస్ కనిపించే తీరు, సంజన కృష్ణమూర్తి హుందాతనం, అందం విజువల్స్‌కు ఆకర్షణను తీసుకొచ్చాయి. ఈ తొలి గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ఈ చిత్రానికి ప్రతిభావంతమైన సాంకేతిక బృందం పనిచేస్తోంది. ‘3 బీహెచ్‌కే’ చిత్రానికి పనిచేసిన అమృత్ రామనాథ్ సంగీతాన్ని అందిస్తున్నారు. కార్తిక్ పళని సినిమాటోగ్రఫీ , షఫీక్ మొహమ్మద్ అలీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘యానిమల్’, ‘పేటా’ చిత్రాలకు పనిచేసిన సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. జాషువా స్టంట్స్, ప్రవీణ్ రాజా కాస్ట్యూమ్స్, షెరీఫ్ కొరియోగ్రఫీ నిర్వహిస్తున్నారు.
కృష్ణకాంత్ పాటలు రాస్తుండగా, సౌండ్ డిజైనింగ్‌ను సురేన్ జీ, అలగియా నిర్వహిస్తున్నారు. సౌండ్ మిక్సింగ్ సురేన్ జీ. అమోల్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. విభిన్నమైన టైటిల్, ఆకట్టుకునేజోడి, పోయిటిక్ గ్లింప్స్‌తో ‘హైడ్ & సిల్క్’ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. కార్తికేయన్ సంతానం స్టోన్ బెంచ్ స్టూడియో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్న తొలి చిత్రంగా ఈ సినిమా నిలవనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























