యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రెజెంటర్‌గా, ఆయన సొంత బ్యానర్ ‘కెఎ ప్రొడక్షన్స్’ సమర్పణలో వస్తున్న వినూత్నమైన మైండ్ బెండింగ్ మిస్టరీ థ్రిల్లర్ ‘హతాః’ . పౌర్ణమి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనుష్ గోరక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిర్మాణ, పంపిణీ సంస్థ దిల్ రాజు ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ చిత్రానికి సంబంధించిన నైజాం మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాల థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకుంది.
దిల్ రాజు నైజాం, యూఏ వంటి కీలకమైన రీజియన్స్‌లో డిస్ట్రిబ్యూషన్‌ను తన చేతుల్లోకి తీసుకోవడంతో ఈ ప్రాజెక్ట్‌కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను ఎల్లప్పుడూ ఆదరించే దిల్ రాజు ‘హతాః’ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు చేపట్టడం సినిమాపై ఉన్న నమ్మకానికి నిదర్శనం.
SVC ప్రొడక్షన్ అండ్ రిలీజ్ హ్యాండ్ పడటంతో నైజాం, ఉత్తరాంధ్రలోని ప్రధాన థియేటర్లలో ఈ చిత్రానికి భారీ స్థాయిలో స్క్రీన్లు కేటాయించనున్నారు.
కథా నేపథ్యం: సీనియర్ నటుడు రెహమాన్, తనుజా పుట్టస్వామి, కుష్లు, నమ్రిత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లే, సైకలాజికల్ హారర్ ఎలిమెంట్స్‌తో సాగనుంది.
నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























