తమిళ స్టార్ హీరో విశాల్ కేవలం తమిళ ప్రేక్షకులకే కాదు…తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తెలుగులో కూడా విశాల్ కు అభిమానులు బాగానే ఉన్నారు. అయితే ఇన్నేళ్లు తమిళంలో సినిమాలు తీసిన విశాల్ ఇప్పుడు డైరెక్ట్ తెలుగు లో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. చాలా కాలంగా స్ట్రయిట్ తెలుగు సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు కానీ ఇప్పటివరకూ కుదరలేదు. కానీ ఇప్పుడు ఆ కల నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తేజ డైరెక్షన్ లో ఈ హీరో తెలుగు సినిమా చేయబోతున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టెంపర్ రీమేక్ అయోగ్య షూటింగ్లో బిజీగా ఉన్న విశాల్, అక్టోబర్ నుంచి తేజ సినిమాకు డేట్లు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
మరోవైపు ప్రస్తుతం తేజ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ‘సీత’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కాజల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా తరువాత తేజ, విశాల్ తో సినిమా చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై పూర్తి వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
[youtube_video videoid=Y63ChapPiXg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: